Mon Dec 23 2024 23:42:00 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈరోజు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబరు నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు డిసెంబరు నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్లో కోటా విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
ఆర్జిత సేవా టిక్కెట్లను...
సెప్టెంబరు 21న వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సెప్టెంబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లతో పాటుడిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను కూడా విడుదల చేయనున్నారు. ఈ టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. తిరుపతిలలో డిసెంబరు నెల గదుల కోటాను సెప్టెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Next Story