Mon Dec 23 2024 03:43:08 GMT+0000 (Coordinated Universal Time)
ఆన్లైన్లో శీఘ్రదర్శనం టిక్కెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనం కోటాను ఆన్లైన్లో విడుదల చేసింది
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనం కోటాను ఆన్లైన్లో విడుదల చేసింది. పది గంటలకు టీటీడీ వెబ్సైట్లో ఆన్లైన్ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. మే, జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ ఆన్లైన్లో ఉంచింది. టీటీడీ అధికార వెబ్సైట్ https://tirupatibalaji.gov.in వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
పెట్టిన వెంటనే....
మే, జూన్ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకునే వీలు కల్పించారు. టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టిన వెంటనే విపరీతమైన రద్దీ ఏర్పడింది. మే, జూన్ నెలలంటే వేసవి సెలవులు కావడంతో ఎక్కువ మంది తిరుమలకు వస్తారు. ఈ రెండు నెలలు అత్యధికంగా రష్ ఉంటుంది. అయితే నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరింది. అధికారిక వెబ్సైట్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
Next Story