Sun Dec 14 2025 18:19:24 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : మూడు నెలలకు ఒకసారి మాత్రమే దర్శనం.. టీటీడీ సరికొత్తనిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. స్థానికులకు మూడు నెలలకు ఒకసారి మాత్రమే తిరుమలను దర్శించుకునే వీలు కల్పించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. స్థానికులకు మూడు నెలలకు ఒకసారి మాత్రమే తిరుమలను దర్శించుకునే వీలు కల్పించింది. స్థానికుల కోటాలో వీరు తిరుమల వెంకటేశ్వరుడిని దర్శంచుకోవాలంటే 90 రోజుల సమయం ఆగక తప్పదు. ఒకసారి టోకెన్ తీసుకున్న తర్వాత మూడు నెలల వరకూ స్థానికుల కోటా కింద తిరిగి టోకెన్ పొందే వీలులేదు. ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి లో నివాసముండే స్థానికులకు అవకాశం టీటీడీ కల్పించింది. డిసెంబరు 3వ తేదీ నుంచి ఈ దర్శనాలను కల్పించనుున్నారు.
స్థానికులకు మాత్రమే...
స్థానికులకు మాత్రమే ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుపతిలో రెండు చోట్ల ఈ టోకెన్లు జారీ చేయనున్నారు. డిసెంబరు 2వ తేదీన తిరుపతిలోని మహతి ఆడిటోరియంలోనూ, తిరుమల బాలాజీనగర్ లోని కమ్యునిటీ హాలులోని దర్శన టోకెన్లు ఉచితంగా ఇ్తారు. అయితే ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో ఈ టోకెన్లు తీసుకు వచ్చిన వారు ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్న నిబంధనను విధించారు. దర్శనం టిక్కెట్ పొందడానికి కూడా ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలి. దివ్యదర్శనం క్యూ లైన్ లో వీరిని అనుమతిస్తారు.
Next Story

