Mon Dec 23 2024 06:42:06 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ఏప్రిల్ నుంచి హుండీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.700 కోట్లు దాటింది. టీటీడీ భారతదేశంలోనే కాకుండా
ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ ధర్మాదాయ సంస్థ 'తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)' అనే సంగతి తెలిసిందే..! వేలల్లో ప్రతిరోజూ ఆ ఏడుకొండల వాడి దర్శనానికి వస్తుంటారు. కోట్లలో విరాళాలు, హుండీకి ఆదాయాలు దక్కుతూ ఉంటాయి. ఇక తాజాగా టీటీడీ దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా రూ.85,705 కోట్ల విలువైన 960 ఆస్తులను కలిగి ఉన్నట్లు ప్రకటించింది. అయితే మార్కెట్ విలువ కనీసం 1.5 రెట్లు ఎక్కువగా, దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. టీటీడీ తన ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.
టీటీడీకి సంబంధించి మొత్తం 960 ఆస్తులు ఉన్నాయని.. వాటి విలువ మొత్తం రూ 85,700 కోట్లుగా సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆలయ 'హుండీ' విరాళాల ద్వారా టీటీడీకి వచ్చే నెలవారీ ఆదాయం కూడా గత ఐదు నెలలుగా క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్ నుంచి హుండీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.700 కోట్లు దాటింది. టీటీడీ భారతదేశంలోనే కాకుండా అమెరికా వంటి కొన్ని దేశాలలో దేవాలయాలను నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా 7,123 ఎకరాల భూమి ఆలయ ట్రస్టు ఆధీనంలో ఉందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం తెలిపారు. 1974 నుంచి 2014 మధ్య (ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు) వివిధ ప్రభుత్వాల హయాంలో వివిధ టీటీడీ ట్రస్టులు వివిధ కారణాలతో 113 ఆస్తులను అమ్మాయని చెప్పారు. అయితే టీటీడీ ఆస్తులను అమ్మడానికి గల కారణాలను చెప్పలేదు ఆయన. 2014 తర్వాత టీటీడీ ఎలాంటి ఆస్తిని అమ్మలేదని, భవిష్యత్తులో తమ స్థిరాస్తులను విక్రయించే ఆలోచన లేదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. "రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, నా అధ్యక్షతన ట్రస్ట్ బోర్డు ప్రతి సంవత్సరం టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. గతేడాది తొలి శ్వేతపత్రం విడుదల చేశామని అన్నారు. ఇక అన్ని ఆస్తుల వివరాలు, మదింపులతో కూడిన శ్వేతపత్రాన్ని టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేశామని తెలిపారు. టీటీడీకి వివిధ బ్యాంకుల్లో 14 వేల కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు, దాదాపు 14 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని తెలిపారు.
ఇక టీటీడీ తిరుమలకు వచ్చే భక్తుల కోసం, ఉద్యోగుల కోసం, ఇతర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం కోసం పలు కార్యక్రమాలను చేపట్టిందని సుబ్బారెడ్డి తెలిపారు. క్లాస్ 4 ఉద్యోగుల యూనిఫామ్స్ కోసం రూ.2.5 కోట్లు కేటాయిస్తామన్నారు. వడమాలపేట దగ్గర భవిష్యత్ అవసరాల దృష్యా 130 ఎకరాలను రూ.25 కోట్లకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రూ 3 కోట్లతో నెల్లూరులో కళ్యాణమండపాల వద్ద ఆలయం నిర్మించాలని తీర్మానించిట్లు చెప్పుకొచ్చారు. రూ 6.3 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్వీ ఆర్ట్స్ కాలేజిలో అభివృద్ది పనులు చేపడతామన్నారు. బ్రహ్మోత్సవాలు తరువాత సర్వదర్శనం భక్తులుకు తిరుపతిలో టోకేన్లు జారి ప్రకియని తిరిగి ప్రారంభిస్తామని సబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే పదార్థాలను సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Next Story