Fri Nov 22 2024 22:56:27 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
అక్టోబరు నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది
అక్టోబరు నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ కోటాను ఉదయం 9 గంటలకు విడుదల చేయనుందని అధికారులు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగానే ప్రకటించింది. అక్టోబరు నెలలో బ్రహ్మోత్సవం జరిగే రోజుల్లో ప్రత్యేక దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. దీనిని చూసుకుని ఆ రోజులు కాకుండా మిగిలిన రోజుల్లో ఈ కోటాలో బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ కోటా కింద బ్రహ్మోత్సవాల్లో బుక్ చేసుకున్నా దర్శనం వీలు కాదు. ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వారు ఇది గమనించాలని అధికారులు కోరారు.
దర్శనానికి 8 గంటలు...
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఈరోజు 19 కంపార్ట్మెంట్లలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. నిన్న తిరుమల శ్రీవారిని 83,880 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,710 భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.86 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story