Sun Dec 22 2024 22:14:07 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు ఆన్లైన్ లో
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనం టోకెన్లు నేడు విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనం టోకెన్లు నేడు విడుదల చేయనుంది. మే నెల కోటాకు సంబంధించి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను నేడు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వసతి గృహాల కేటాయింపు కోసం ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించనుంది. మే నెలలో వేసవి సెలవులు ఉండటంతో సహజంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ టిక్కెట్లు హాట్ కేకుల్లా వెంటనే అమ్ముడయిపోతాయి.
పదిహేను గంటలు...
నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఇరవై కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేనుగంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి కూడా స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,880 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,904 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారి హుడీ ఆదాయం 3.03 కోట్ల రూాపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story