Mon Dec 23 2024 17:22:08 GMT+0000 (Coordinated Universal Time)
రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విడుదల
రేపు ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తుంటారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోసం వేచి చూస్తుంటారు. రేపు ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ప్రతి నెలకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తుంది.
కరోనా నేపథ్యంలో....
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో దర్శనం టిక్కెట్లను తగ్గించే అవకాశముంది. రేపు ఉదయం 9 గంటలకు టిక్కెట్లను విడుదల చేయనుంది. ప్రతి నెల టిక్కెట్లను రిలీజ్ చేసిన నిమిషాల్లోనే అమ్ముడు అవుతాయి. దీంతో రేపటి టిక్కెట్ల కోసం భక్తులు దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు.
Next Story