Mon Dec 23 2024 08:10:00 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి భక్తులకు తీపి కబురు
మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆన్ లైన్ లో విడుల చేయనుంది.
తిరుమల శ్రీవారి దర్శనం అంటేనే భక్తులు పరవశించిపోతారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకుంటారు. అయితే టిక్కెట్లు దొరకడం చాలా కష్టమవుతుంది. అందుకే కొన్ని ఏళ్లుగా ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం టిక్కెట్లతో పాటు ఆర్జిత సేవా టిక్కెట్లను కూడా ఉంచుతున్నారు. ఆర్జిత సేవలను కేవలం వీఐపీలకు మాత్రమే పరిమితం చేయకుండా సామాన్య భక్తులకు కూడా అందుబాటులో తెచ్చేందుకు ఆన్ లైన్ లో టిక్కెట్ లను విడుదల చేయనుంది.
ఆర్జిత సేవా టిక్కెట్లు...
మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి మూడు నెలల ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆన్ లైన్ లో విడుల చేయనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ ఆన్ లైన్ లో లక్కీడిప్ నిర్వహించనుంది. ఈ లక్కీ డిప్ లో టిక్కెట్లు పొందిన భక్తులు నిర్దేశిత డబ్బులు చెప్లించి టిక్కెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ టిక్కెట్లను నేడు విడుదల చేయనుంది.
Next Story