Mon Dec 23 2024 08:15:57 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నేడు విడుదల చేయనుంది
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నేడు విడుదల చేయనుంది. ఉదయం పద గంటలకు ఆన్ లైన్ లో ఈ టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు అవకాశముంటుంది. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ అందుకోసం టిక్కెట్లు దొరక్క నిరాశ చెందుతుంటారు. అయితే నేడు విడుదల చేసే టిక్కెట్లు మే నెల కోటాకు సంబంధించినవని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టిక్కెట్ల డిప్ కు ఈ నెల 21వ తేదీ ఉదయం పది గంటల వరకూ అవకాశముంటుంది.
లక్కీడిప్‌లో టిక్కెట్లు...
లక్కీడిప్ లో టిక్కెట్లు పొందిన వారు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు డబ్బులు చెల్లించి టిక్కెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 22వ తేదీన శ్రీవారి కల్యాణోత్సవం, 23న అంగప్రదిక్షిణం, 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతుంది. టిక్కెట్లను పొందిన వారు మే నెలలో స్వామి వారిని దర్శించుకునేందుకు సులువు అవుతుంది.
Next Story