Mon Dec 23 2024 07:53:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేయనుంది
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు ఈ టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబరు నెల కోటా కింద ఈ టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చని అధికారులు కోరారు. ఆన్ లైన్ లో ఆర్జిత సేవా టిక్కెట్లకు లక్కీ డిప్ నమదో ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.
లక్కీ డిప్ ద్వారా...
కల్యాణాతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్ల కోటాతో పాటు వాటికి సంబంధించిన దర్శన కోటా అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆన్ లైన్ లో విడుదల కానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తులు ఇది గమనించి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Next Story