Mon Apr 21 2025 15:46:41 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : త్వరపడండి.. వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల కోసం?
తిరుమల తిరుపతి దేవస్థానం మరికాసేపట్లో వైకుంఠం ద్వార దర్శనానికి సంబంధించి మూడు వందల రూపాయల టిక్కెట్లను విడుదల చేయనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం మరికాసేపట్లో వైకుంఠం ద్వార దర్శనానికి సంబంధించి మూడు వందల రూపాయల టిక్కెట్లను విడుదల చేయనుంది. పది గంటలకు ఈ టిక్కెట్లు ఆన్ లైన్ లో ఉంచనుంది. తిరుమలలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ వైకుంఠ ద్వారదర్శనం తిరుమలలో జరగనుంది. ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
దర్శనానికి ....
ఈ టిక్కెట్లతో పాటు శ్రీవాణి దర్శన టిక్కెట్లు, గదుల కోటాను కూడా టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని ఎక్కువ మంది భక్తులు భావిస్తుంటారు. అందుకే ఈసారి టీటీడీ 2.25 లక్షల టిక్కెట్లను విడుదల చేయనుంది. మూడు వందల రూపాయల టిక్కెట్లు రోజుకు 22500 టిక్కెట్లను విడుదల చేయనుందని అధికారులు తెలిపారు. శ్రీవాణి దర్శన టిక్కెట్లు రోజుకు రెండు వేల చొప్పున ఆన్ లైన్ లో ఉంచనుంది. వసతి గదుల కోటా మాత్రం సాయంత్రం ఐదు గంటలకు ఆన్ లైన్ లో ఉంచనుంది.
Next Story