Fri Apr 04 2025 13:31:51 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు నేటి నుంచి గుడ్ న్యూస్
తిరుమలకు వెళ్లే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.

తిరుమలకు వెళ్లే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదంలో వడలు వడ్డించనున్నారు. తిరుమలలో కొత్త దేవస్థానం బోర్డు ఏర్పాటయిన తర్వాత అనేక రకాలుగా మార్పులు తెస్తున్నారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నారు.
వడ ప్రసాదం...
అయితే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో రోజుకు వేలాది మంది భక్తులు వచ్చి అన్నప్రసాదాలను స్వీకరిస్తారు. ఎంత మంది వచ్చినా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, అల్పాహారం కూడా అందించనుంది. అయితే తాజాగా తొలిరోజున 35 వేల మందికి వడ ప్రసాదం వడ్డించాలని నిర్ణయించారు.
Next Story