Mon Dec 23 2024 12:23:54 GMT+0000 (Coordinated Universal Time)
ఆన్ లైన్ లో సేవల టిక్కెట్లు
సెప్టంబరు నెలకు సంబంధించి వివిధ సేవల టిక్కెట్లన తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేసింది.
సెప్టంబరు నెలకు సంబంధించి వివిధ సేవల టిక్కెట్లన తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాంకర సేవల టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఆన్ లైన్ లో విడుదలయిన వెంటనే అధిక సంఖ్యలో భక్తులు తమ టిక్కెట్లను భక్తులు నమోదు చేసుకున్నారు. సెప్టంబరు నెలకు సంబంధించిన కోటాను ఈరోజు టీటీడీ విడుదల చేసింది.
భక్తుల రద్దీ....
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,821 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,732 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.78 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story