Mon Dec 23 2024 13:00:35 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి స్పెషల్ దర్శన్ టోకెన్లు నేడు విడుదల
ఈరోజు ఆన్లైన్ లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది
ఈరోజు ఆన్లైన్ లో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులకు ఉచిత ప్రత్యేక దర్శనం కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారిని ఆగస్టు నెలలో దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్శనం కోటాను ఈరోజు విడుదల చేయనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు మాత్రమే ఈ ప్రత్యేక దర్శనం కోటా టిక్కెట్లు వర్తిస్తాయి. ఉదయం 9 గంటల నంచి టోకెన్లను విడుదల చేయనున్నారు. రోజుకు వెయ్యి చొప్పున టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ టోకెన్లతో స్వామి వారిని మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ లో దర్శించుకోవచ్చు.
నేడు తిరుమలలో....
తిరుమల శ్రీవారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,395 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,533 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.83 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
.
Next Story