Mon Dec 23 2024 17:39:24 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఆన్ లైన్ లో ఆర్జిత సేవల టిక్కెట్లు
ఆర్జిత సేవల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేటి నుంచి విడుదల చేయనుంది
ఆర్జిత సేవల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేటి నుంచి విడుదల చేయనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఈ టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది. ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఆన్ లైన్ ఆర్జిత సేవా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22వ తేదీ వరకూ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్వామి వారి ఆర్జిత సేవా టిక్కెట్లను నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
పండగ దినాల్లో.....
గత రెండేళ్ల నుంచి స్వామి వారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం లేదు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ అందుబాటులోకి తేనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మరాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. ఉగాది, శ్రీరామనవమి వంటి పండగల సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
Next Story