Mon Dec 23 2024 16:15:02 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రద్దీ అంత ఉందా?
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం శ్రీవారిని 72,664 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో బుధవారం 32,336 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు.నితన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ తరపున ఛైర్మన్ సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రికిి జ్ఞాపికలు అందచేశారు.
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం మొదలైంది. బుధవారం జూలై 12 రాత్రి మొదటి ఘాట్ రోడ్డులో రెండు చిరుతలు కనిపించాయి. కుక్కను వేటాడుతూ ఘాట్ రోడ్డు మీదకి వచ్చాయి. 56వ మలుపు వద్ద రోడ్డు మీద నుంచి పరుగెత్తిన చిరుతలను చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొంత మంది వాహనదారులు వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. టీటీడీ అధికారులు, అటవీ శాఖా అధికారులు చిరుతలు సంచరించిన ప్రదేశానికి చేరుకున్నారు. తిరుమల విజిలెన్స్ సిబ్బంది వాహనాలను విడివిడిగా కాకుండా ఐదారు వాహనాలను కలిపి ఒకేసారి పంపిస్తున్నారు.
Next Story