Mon Dec 23 2024 15:43:55 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. వెండివాకిలి నుంచి సింగిల్ లైన్ విధానం పాటిస్తోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాడు కూడా కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం 86,181 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 30,654 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. వెండివాకిలి నుంచి సింగిల్ లైన్ విధానం పాటిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ రోజు నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలకు టీటీడీ నిర్ణయించింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను ఈ రోజు విడుదల చేయనుంది. సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
Next Story