Mon Dec 23 2024 03:57:05 GMT+0000 (Coordinated Universal Time)
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్
భక్తుల రద్దీ మరింత పెరిగితే.. క్యూ కాంప్లెక్స్ వెలుపలికి కూడా క్యూలైన్లు పెరిగే అవకాశం ఉంది. స్వామివారి సర్వదర్శనానికి ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండపై ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ మరింత పెరిగితే.. క్యూ కాంప్లెక్స్ వెలుపలికి కూడా క్యూలైన్లు పెరిగే అవకాశం ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. నిన్న 74,583 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే 40,343 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. గురువారం భక్తుల కానుకల ద్వారా స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు తెలిపింది.
కాగా.. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించి.. యాగశాలల వైదిక కార్యక్రమాలు చేసిన అనంతరం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు ఉదయం 8.22 నుండి 8.46 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు.
Next Story