ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని
తిరుమల కొండపై గడచిన 9 రోజులుగా సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ముగిశాయి. బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా సాగిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఏకాంతంగానే స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించగా ఈ ఏడాది భక్తుల మధ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి ఈ ఏడాది జరిగిన బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకనుగుణంగానే ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల నిర్వహణ ఎలాంటి విఘ్నాలు లేకుండానే పూర్తి అయ్యాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీవారి పుష్కరిణిలోని వరహా స్వామి మండపం వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి.