Sun Mar 30 2025 08:59:23 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే కొలికపూడికి షాకిచ్చిన హైకమాండ్
తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం షాకిచ్చింది

తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఇటు నియోజకవర్గ టీడీపీ నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఫిర్యాదు చేశారు. నేరుగా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వారు చంద్రబాబుకు వివరించారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను ఎమ్మెల్యే కొలికపూడి వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొలికపూడి కూడా ఈ నెల 30వ తేదీన తిరువూరు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
వసంతను ఇన్ ఛార్జిగా...
ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం తిరువూరు నియోజకవర్గం ఇన్ ఛార్జి గా వసంత కృష్ణ ప్రసాద్ ను నియమించినట్లు తెలిసింది. వచ్చే సోమవారం ఆయన బాధ్యత లు స్వీకరించనున్నారు. మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఒక నెల రోజులు పాటు నియోజకవర్గం బాధ్యతలను చూడాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. తదుపరి నిర్ణయం నియోజకవర్గం కార్యకర్తలు తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కొలికిపూడి వివాదంగా మారడంతో అధినాయకత్వం వెంటనేచర్యలకు దిగినట్లు తెలిసింది.
Next Story