Fri Apr 11 2025 18:36:17 GMT+0000 (Coordinated Universal Time)
పట్టించుకోవట్లేదట.. తప్పుకుంటారా? తప్పిస్తారా?
కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పలువురు ఎమ్మెల్యేలు

కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్లలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా ఒకరు. పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయనను పిలవడం దాదాపుగా మానేశారు. కూటమి నాయకులతో కనీసం మంచి ర్యాపో కూడా ఆయన మెయిన్టైన్ చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. తిరువూరులో ఎమ్మెల్యేకు, సొంత పార్టీ నేతలకు కొద్దికాలంగా వివాదం నడుస్తోంది. అది రచ్చకెక్కింది కూడా!! అదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు కూడా తెలియజేశారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనకు వచ్చిన సీఎం కొలికపూడిని కనీసం పట్టించుకోలేదు.
నందిగామ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. సీఎం తన వద్దకు రాగానే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆయనకు నమస్కరించారు. చంద్రబాబు ఒక్క క్షణం ఆయన్ను చూశారు కానీ పలకరించలేదు. ఆ తర్వాత మిగిలిన నాయకులు, మహిళలు చంద్రబాబుతో మాట్లాడారు. కొలికపూడి కూడా ముందుకు వెళ్లి కలవాలని అనుకోలేదు.
Next Story