Fri Nov 22 2024 19:46:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో విద్రోహదినం
నేడు ఏపీ ఉద్యోగులు విద్రోహ దినాన్ని పాటిస్తున్నారు. సెప్టంబరు 1వ తేదీన విద్రోహ దినంగా ఏపీ ఎన్జీవో ప్రకటించింది.
నేడు ఏపీ ఉద్యోగులు విద్రోహ దినాన్ని పాటిస్తున్నారు. సెప్టంబరు 1వ తేదీన విద్రోహ దినంగా ఏపీ ఎన్జీవో ప్రకటించింది. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నా ఉద్యోగ సంఘాల నేతలను అరెస్ట్ చేయడం అన్యాయమని ఏపీ ఎన్జీవోల సంఘం పేర్కొంది. సీపీఎస్ రద్దు చేయాలంటూ ఈరోజు సీఎం ఇంటి ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అనంతరం ఈ కార్యక్రమాన్ని సెప్టంబరు 11వ తేదీకి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
అక్రమ అరెస్ట్ లకు నిరసనగా....
అయినా ఉద్యోగ సంఘాల నేతలను అక్రమంగా నిర్భంధాలకు గురి చేస్తున్నారని ఏపీ ఎన్జీవోల సంఘం ఆరోపిస్తుంది. ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నా అరెస్ట్ లు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేసిన ఏపీ ఎన్జీవోల సంఘం రేపు కలెక్టరేట్ల వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెడుతూ వేధిస్తున్నారని వారు ఆరోపించారు.
Next Story