Wed Dec 25 2024 13:51:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్పీప్రసాద్ కంటి ఆసుపత్రికి చంద్రబాబు
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత చెన్నుపాటి గాంధీని నేడు చంద్రబాబు పరామర్శించనున్నారు.
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీని నేడు చంద్రబాబు పరామర్శించనున్నారు. నిన్న చెన్నుపాటి గాంధీపై కొందరు దాడి చేయగా కంటి గుడ్డుకు గాయమయిందని వైద్యులు చెప్పారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. అయితే కంటికి చికిత్స చేసినా ప్రయోజనం లేదని వైద్యులు చెప్పారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
గాంధీని పరామర్శించేందుకు....
పటమటలో పైప్లైన్ మరమ్మతులు చేయిస్తుండగా చెన్నుపాటి గాంధీపై దాడి జరిగింది. తనపై వైసీపీ నేతలే దాడి చేశారని గాంధీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నుపాటి గాంధీని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నానితో పాటు పలువురు నేతలు పరామర్శించారు. నేడు చంద్రబాబు చెన్నుపాటి గాంధీని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించనున్నారు. గాంధీపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story