Mon Dec 23 2024 15:11:39 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ నేడు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో ఓటాన్ అకౌంంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. బడ్జెట్ ఈరోజు ప్రవేశ పెడుతుండటంతో ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.
శాసనమండలిలో...
2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఉదయం 11 గంటలకు శాసనమండలిలో ఆర్థిక మంత్రి ప్రవేశ పెడతారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశ పెట్టనుండగా, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ ఈసారి 2.85 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి.
Next Story