Mon Dec 23 2024 07:46:25 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేరుగా శ్రీవారి దర్శనం
తిరుమలలో నేడు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తుంది. క్యూ లైన్ లో వేచి ఉండకుండానే నేరుగా స్వామి ని దర్శించుకునే వీలుంది.
తిరుమలలో నేడు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తుంది. క్యూ లైన్ లో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. సాధారణంగానే నెలకొంది. దీపావళి కావడంతో భక్తులు పెద్దగా తిరుమలకు రాకపోవడంతో క్యూ లైన్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి.
హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 74,807 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,974 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది.
Next Story