Mon Dec 23 2024 03:24:54 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేడు నల్లారి నామినేషన్
నేడు బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నేడు బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి ఆయన రాజంపేట పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు.
భారీ ర్యాలీతో...
రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయనున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డితో తలపడనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.
Next Story