Mon Dec 23 2024 02:14:29 GMT+0000 (Coordinated Universal Time)
Nara Brahmini : నేడు మంగళగిరిలో నారా బ్రాహ్మణి
నేడు మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
నేడు మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తన భర్త నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. మహిళలను కలసి టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు. ఈసారి లోకేష్ గెలిచేందుకు అన్ని రకాలుగా సహాయపడాలని ఆమె అందరినీ కోరనున్నారు.
లోకేష్ గెలుపు కోసం...
నారా లోకేష్ గెలిస్తే మంగళగిరి అభివృద్ధి చెందుతుందని, గత ఐదేళ్లుగా అధికారంలో లేకపోయినా మంగళగిరిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ లోకేష్ ప్రజల మధ్యనే ఉన్నాడని, ఈసారి ఆదరించాలని నారా బ్రాహ్మణి కోరనున్నారు. నారా బ్రాహ్మణి ఇంటింటికీ తిరుగుతూ నారా లోకేష్ కు మద్దతుగా నేడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story