Mon Dec 23 2024 02:51:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మే డే పెన్షన్ లు ఇక రేపేనా?
నేడు మేడే సందర్బంగా పింఛను దారులకు పింఛను సొమ్ము అవకాశం లేదు
నేడు మేడే సందర్బంగా పింఛను దారులకు పింఛను సొమ్ము అవకాశం లేదు. ప్రతి నెల ఒకటో తేదీన పింఛను మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మే డే సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం కావడంతో పింఛన్లు అందుతాయా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 48 లక్షల మంది బ్యాంక్ అకౌంట్లున్న పింఛను దారులకు తమ పింఛను మొత్తాన్ని బ్యాంకుల్లో వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మిగిలిన వారికి...
బ్యాంకు అకౌంట్లు లేని వారికి ఇంటికి వెళ్లి పింఛన్లు అందించాలని చీఫ్ సెక్రటరీ జవహర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ బ్యాంకు అకౌంట్లలోనే జమ చేయాలని నిర్ణయించారు. అయితే ఈరోజు మేడే బ్యాంకులకు సెలవు దినం కావడంతో రేపు బ్యాంక్ అకౌంట్లలో పింఛను దారులకు సొమ్ము జమ చేసే అవకాశముంది. అలాగే మిగిలిన పింఛను దారులకు కూడా రేపటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిసింది.
Next Story