Tue Mar 18 2025 00:20:15 GMT+0000 (Coordinated Universal Time)
Nda Alliance : నేడు చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలు
నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు కలసి ప్రచారం చేయనున్నారు.

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు కలసి ప్రచారం చేయనున్నారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గంలో నేతలు ఇద్దరూ పర్యటించనున్నారు. ఇద్దరూ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో వారు పాల్గొంటున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
రోడ్ షోలలో కూడా ఇద్దరు నేతలు పాల్గొననుండటంతో పెద్దయెత్తున అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశాలుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నిన్న నిడదవోలు, తణుకులో పర్యటించిన పర్యటించి సభల్లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు రాజమండ్రిలో బస చేశారు. ఈ సందర్భంగా అమలాపురంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Next Story