Thu Dec 19 2024 11:04:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పై నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తుంది.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పై నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తుంది. ఇటీవల ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఉప్పు, పప్పు, నూనె ధరలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తుంది.
వ్యూహకమిటీ సమావేశంలో....
అందుకే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. నిరసన ప్రదర్శనలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. నిన్న జరిగిన టీడీపీ వ్యూహకమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ధరలను పోలుస్తూ ఈ నిరసనను తెలియజేయనున్నారు.
Next Story