Mon Dec 23 2024 15:47:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో?
నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై విచారణ జరగనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై విచారణ జరగనుంది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై దాదాపు 77 పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. అయితే దీనిపై త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.
రద్దు చేశామని....
ప్రభుత్వం ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులను, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కు తీసుకుంది. వాటిని రద్దు చేసింది. ఈ విషయమే హైకోర్టుకు తెలిపింది. కానీ మరో రూపంలో బిల్లులు తెస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను పిటీషన్ దారులు ఉదహరిస్తున్నారు. మరి ఈరోజు హైకోర్టులో జరిగే విచారణలో ఏం తేలనుందో చూడాలి. కరోనా దృష్ట్యా విచారణను వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నారు
Next Story