Mon Dec 23 2024 09:51:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తుఫాను ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటన
ఈరోజు తిరుపతి జిల్లాలో మించాంగ్ తుఫాన్ నష్ట ప్రభావిత, ముంపు ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తుంది
ఈరోజు తిరుపతి జిల్లాలో మించాంగ్ తుఫాన్ నష్ట ప్రభావిత, ముంపు ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తుంది.మిచౌంగ్ తుఫాను మిగిల్చిన నష్టాలను, అందించిన సహాయక చర్యలు వివరించనున్న తిరుపతి జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్ కేంద్ర బృందానికి వివరిస్తున్నారు. తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను వారు పరిశీలిస్తున్నారు.
సాయం చేయాలంటూ....
మిచౌంగ్ తుఫాన్ కారణంగా పెద్దయెత్తున పంట నష్టంతో పాటు పశువులు కూడా మరణించాయని అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకు వచ్చారు. చెరువు కట్టలు కూడా తెగి నష్టం జరిగిందని చెప్పారు. మానవతా దృక్పథంతో ఆదుకునెలా కేంద్రానికి నివేదించాలని నివేదిక అందించాలని కోరారు. దాదాపు నాలుగు జిల్లాల్లో పది వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని అధికారులు చెప్పినట్లు తెలిసింది.
Next Story