Mon Dec 23 2024 02:37:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
నేడు ఆగస్గు నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. నేటి నుంచి 27వ తేదీ వరకూ తిరుమలను దర్శించుకునే వారికి ఆన్ లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు టిక్కెట్లు విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించిన టిక్కెట్లను నేడు విడుదల చేయనున్నారు.
ఆగస్టు నెలకు...
తిరుమలలో శ్రీవారి దర్శనం అంటే అందరికీ కష్టమే. అందుకే ముందుగా బుక్ చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో ప్రతి నెలకు సంబంధించి టిక్కెట్లను అందుబాటులో ఉంచనుంది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు వసతి కోసం రూమ్ లను కూడా బుక్ చేసుకునే వీలు ఆన్ లైన్ లో కల్పించింది. నేడు ఆగస్టు నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ టిక్కెట్ల హట్ కేకుల్లా అమ్ముడుపోనున్నాయి.
Next Story