Fri Dec 20 2024 08:43:13 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు
నేడు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు తెలియచేయనుంది. ఈకేసులో తోట త్రిమూర్తులు నిందితులుగా ఉన్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల నాటి కేసులో సంచలన తీర్పు వెలువడనుంది. శిరోముండనం కేసులో నేడు విశాఖ న్యాయస్థానం తన తీర్పు వెలువరించనుంది. రామచంద్రాపురంలో దళితుడి శిరోముండనం కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం నేడు వెలువరించనునంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 1996 డిసెంబరు 29న ఈ ఘటప జరిగింది. విచారణ బుధవారం పూర్తయింది.
వైసీపీ నేత....
ఈ శిరోముండనం కేసులో వైసీీపీ నేత తోట త్రిమూర్తులు ప్రధాన నిందితుడిగా ఉండగా మరో ఎనిమిది మంది వరకూ నిందితులుగా ఉన్నారు. కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించనున్నదన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో శిరోముండనం కేసు తీర్పు కీలకం గా మారనుంది.
Next Story