Fri Dec 27 2024 19:31:53 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ షర్మిల పర్యటన
నేడు వైఎస్ షర్మిల గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు.
Ys Sharmila :నేడు వైఎస్ షర్మిల గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయయాత్ర పేరిట ఆమె పర్యటిస్తూ వైసీపీ, టీడీపీలకు వ్యతిరేకంగా ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రత్యేక హోదాను సాధించేందుకు పోరాడతామంటూ సభల్లో చెబుతున్నారు.
మూడు నియోజకవర్గాల్లో...
రెండు పార్టీలూ ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ మోసం చేశాయని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ కు అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలిలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పామర్రులోనూ, రాత్రికి పెడన సభలోనూ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు.
Next Story