Sun Dec 29 2024 02:33:41 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు తాను పుట్టిన ఆసుపత్రికి వైఎస్ షర్మిల
ఈరోజు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజక వర్గాల్లో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు
కడప జిల్లాలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతుంది. ఈరోజు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజక వర్గాల్లో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం 10.15 గంటలకు వైఎస్ వివేకానంద రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు ముద్దునూరు పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు.
కడప జిల్లాలో పర్యటన...
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రాంతాన్ని షర్మిల సందర్శించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జమ్మలమడుగు క్యంబేల్ ఆసుపత్రిని సందర్శిస్తారు. అక్కడే షర్మిల జన్మించడంతో ఆ ఆసుపత్రికి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు జమ్మలమడుగులోనూ, రాత్రి 7 గంటలకు ప్రొద్దుటూరు లో బహిరంగ సభలో పాల్గొంటారు.
Next Story