Sat Jan 11 2025 20:08:03 GMT+0000 (Coordinated Universal Time)
ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈరోజు సినీ పరిశ్రమ సమస్యలకు ఎండ్ కార్డు కాదు శుభం కార్డు పడుతుందని ఎయిర్ పోర్టులో వ్యాఖ్యానించారు. చర్చలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తుందని చిరంజీవి మీడియాకు తెలిపారు.
టాలీవుడ్ ప్రముఖులు...
తనతో పాటు ఎవరు వస్తున్నారో తనకు తెలియదని చిరంజీవి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నుంచి తనకు ఆహ్వానం ఉందని ఆయన తెలిపారు. కాగా ముఖ్యమంత్రి జగన్ ను చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ తో పాటు దర్శకుడు కొరటాల శివ, రాజమౌళితో పాటు నిర్మాతలు నిరంజన్ రెడ్డి, ఆర్ నారాయణమూర్తి కూడా భేటీ అవుతారు.
Next Story