Tue Apr 08 2025 18:56:22 GMT+0000 (Coordinated Universal Time)
Sai Dharam Tej: నారా లోకేష్ ను కలిసిన హీరో సాయి ధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఏపీ మంత్రి నారా లోకేశ్ ను

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. ఏపీలో వచ్చిన వరదలు ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేశాయి. వారికి సహాయంగా పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు. హీరో సాయి తేజ్ రూ.10 లక్షల విరాళం ప్రకటించగా.. ఆ చెక్ ను తాజాగా నారా లోకేశ్ కు అందించారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ ను మంత్రి లోకేశ్ అభినందించారు.
విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సాయి తేజ్ దర్శించుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ఆమ్మ ప్రేమ ఆరాధన వృద్ధాశ్రామానికి కూడా వెళ్లారు. ఆ వృద్ధాశ్రమానికి వెళతానని గతంలో ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని ఇప్పుడు నెరవేర్చారు సాయి తేజ్. అక్కడి వృద్ధులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వృద్ధాశ్రమానికి రూ.5లక్షలను విరాళంగా ఇచ్చారు.
డిక్షన్ గ్రూప్ సంస్థ తరపున రూ.1 కోటి చెక్ ను కంపెనీ ప్రతినిధులు అందించారు. నెక్కంటి సీ ఫుడ్స్ సంస్థ కోటి రూపాయలను విరాళంగా అందించింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్ మిల్లర్ల అసోసియేషన్ రూ.25 లక్షలు, రేస్ పవర్ సంజయ్ గుప్తా రూ.25 లక్షలు అందించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో సంధ్యా ఆక్వా రూ.1 కోటి విరాళం అందించింది.

Next Story