Mon Dec 23 2024 13:03:57 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి జగన్ తో భేటీ అయిన అలీ
ఇటీవలే పలువురు సినీ ప్రముఖులతో కలిసి అలీ.. జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే అలీని మళ్లీ కలవాలని
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ నటుడు అలీ మరోసారి కలిశారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులతో కలిసి అలీ.. జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే అలీని మళ్లీ కలవాలని సీఎం జగన్ చెప్పడంతో.. నేడు మరోసారి ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారు. అలీకి వైసీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : సీఎం జగన్ ను కలిసిన ఏపీ నూతన డిజిపి
ఇదిలా ఉండగా.. త్వరలోనే పార్టీ ఆఫీసు నుంచి ప్రకటన ఉంటుందని చెప్పారని అలీ తెలిపారు. తాను పదవులను ఆశించి ఇక్కడికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు ఉన్న పాత పరిచయంతోనే.. పార్టీ కోసం పనిచేసినట్లు చెప్పారు. తనకు పార్టీ టికెట్ కేటాయింపుపై రెండు వారాల్లో ప్రకటన ఉంటుందని చెప్పారని, ఆ ప్రకటన ఉన్నా లేకపోయినా వైసీపీతో తన అనుబంధం విడదీయలేనిదని తెలిపారు. కాగా.. 2019 ఎన్నికల సమయంలో నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
Next Story