Sat Nov 23 2024 00:02:02 GMT+0000 (Coordinated Universal Time)
టమాటా... కిలో రూపాయి
టమాటా రైతు పూర్తిగా పడిపోయింది. రైతుకు కనీసం ఉత్పత్తి ఖర్చు కూడా రావడం లేదు
టమాటా రైతు పూర్తిగా పడిపోయింది. రైతుకు కనీసం ఉత్పత్తి ఖర్చు కూడా రావడం లేదు. రవాణా ఖార్చు కూడా దండగ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో టమాటా ఐదు రూపాయలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పంట ఖర్చుతో పాటు రవాణా ఖర్చులు కలుపుకుంటే తమకు నష్టమే వస్తుందని రైతులు వాపోతున్నారు. అందుకే మార్కెట్ కు తీసుకురావడంత వేస్ట్ అని భావించి రోడ్లపైనే వృధాగా పడి వేస్తున్నారు. కనీసం టమాటా పండించిన రైతులకు కూలీ ఖర్చు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఆందోళన....
తాజాగా అనంతపురంలో గిట్టుబాటు ధర లేదని క్లాక్ టవర్ సెంటర్ లో రైతులు ఆందోళనకుక దిగారు. రోడ్లపై టమాటాలను పోసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రైతులతో పాటు రైతు సంఘం నేతలను అరెస్ట్ చేశారు. కిలో రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైవు భరోసా కేంద్రాల ద్వారా టమాటాను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు టమాటాలను పోసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను, రైతు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story