Fri Nov 22 2024 20:37:04 GMT+0000 (Coordinated Universal Time)
టమాటా ధరలు.. ఇంత దారుణమా?
జులై నెలలో టమాటాల ధరలు 100-200 పలికాయి. జూలై నెలాఖరు నుంచి
కొద్దిరోజుల కిందట వందల్లో పలికిన టమాటా ధరలు ఇప్పుడు భారీగా పతనమయ్యాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా ధరలు దిగి వచ్చాయి. రైతులు సుమారు 10 టన్నుల టమాటాను మార్కెట్కు తెచ్చారు. వేలంలో క్వింటాలు టమాటాకు రూ.వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. కిలోకు రూ.10 వస్తోందని రైతులు వాపోతున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వల్ల ధరలు పతనం అవుతోంది. మదనపల్లె, అనంతపురం జిల్లాలోని మార్కెట్లలో కూడా టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. మార్కెట్లలో కిలో టమాటాకు రూ.20-40 పలుకుతోంది. జులై నెలలో టమాటాల ధరలు 100-200 పలికాయి. జూలై నెలాఖరు నుంచి ధరలు మెల్లిగా పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు రూ.10కు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధరలు దక్కడం లేదని అంటున్నారు.
దేశంలో సెప్టెంబరు నెల నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దేశంలో జులై నెలలో కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిందని అన్నారు. పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు సరఫరా వైపు దృష్టి సారించాలని అన్నారు. టమాటా ధరలు క్రమేణా తగ్గడం, ఉల్లి ధరలు పెరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు.
Next Story