Sat Nov 23 2024 01:14:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విశాఖ బంద్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నేడు విశాఖ బంద్ కు పిలుపునిచ్చాయి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నేడు విశాఖ బంద్ కు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలన్నీ బంద్ కు పిలుపునివ్వడంతో విశాఖలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ఏడాది నుంచి కార్మికులు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి దీక్షకు మద్దతుగా నేడు అన్ని కార్మిక సంఘాలు కలిపి విశాఖ బంద్ కు పిలుపునిచ్చాయి.
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు....
స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోగా, ఏడాదికి తాము ఐదుకోట్ల రూాపాయల పన్నులను చెల్లిస్తున్నామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. సంవత్సరానికి 28 వేల కోట్ల టర్నోవర్ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కావాలని, కొందరి ప్రయోజనాల కోపం ప్రయివేటీకరించడానికి పూనుకుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ బంద్ కు ప్రజల మద్దతు కావాలని కోరాయి.
Next Story