Mon Nov 25 2024 20:46:29 GMT+0000 (Coordinated Universal Time)
దర్శన సమయం 36 గంటలు
తిరుమలలో రద్దీ పెరిగింది. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
తిరుమలలో రద్దీ పెరిగింది. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్లో ప్రవేశించే వారికి దర్శనం ముప్ఫయి ఆరు గంటల సమయం పడుతుంది.
ప్రత్యేక దర్శనం...
మూడు వంందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన శీఘ్రదర్శనం చేసుకోవాలనే భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,782 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,844 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్ల రూపాయలు వచ్చింది. అధికారులు వెల్లడించారు.
మూడు రోజుల సెలవులు...
వేసవితోపాటు వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు విశేషంగా భక్తులు వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల చెబుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Next Story