Sun Dec 22 2024 19:59:46 GMT+0000 (Coordinated Universal Time)
గుండెపోటుతో విద్యార్థి మృతి
పల్నాడు జిల్లాలో విషాదం జరిగింది. పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్లో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు
పల్నాడు జిల్లాలో విషాదం జరిగింది. పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్లో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి కోటిస్వాములు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిన్న రాత్రి భోజనం చేశాక ఊపిరాడటం లేదని కోటిస్వాములు తన స్నేహితులకు చెప్పాడు.
ఆసుపత్రికి తీసుకెళ్లినా...
అయితే వెంటనే స్నేహితులు వార్డెన్కు చెప్పడంతో వార్డెన్ కోటిస్వాములను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు తెలిపారు. అతి చిన్న వయసులో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
Next Story