Mon Jan 13 2025 02:36:35 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : విజయవాడ వైసీపీలో విషాదం
విజయవాడ వైసీపీలో విషాదం నెలకొంది. వైసీపీ నేత కోనేరు రాజేంద్ర ప్రసాద్ మృతి చెందారు
విజయవాడ వైసీపీలో విషాదం నెలకొంది. వైసీపీ నేత కోనేరు రాజేంద్ర ప్రసాద్ మృతి చెందారు. ఆయన విజయవాడలో ప్రముఖ వ్యాపార వేత్త. వైసీపీ నేతగా కొనసాగుతున్నారు. 2014లో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన వైసీపీ నుంచి ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు భార్యత ముగ్గురు కుమారులున్నారు. కోనేరు రాజేంద్ర ప్రసాద్ది విజయవాడలోని గుణదలలో స్వస్థలం.
గుండెపోటుతో...
ప్రస్తుత ఎంపీ కేశినేని నానిపై పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. అయితే నిన్న రాత్రి గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు. కోనేరు రాజేంద్ర ప్రసాద్ మృతికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కోనేరు రాజేంద్ర ప్రసాద్ అంత్యక్రియలు చెన్నైలో నేడు జరగనున్నాయి.
Next Story