Sun Dec 22 2024 18:11:26 GMT+0000 (Coordinated Universal Time)
వాగులో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాదం అలుముకుంది. నంబూరు పాఠశాల టీచర్ రాఘవేంద్రతో పాటు ఇద్దరు విద్యార్థులు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రెండు జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. అయితే గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాదం అలుముకుంది. నంబూరులోని పాఠశాలకు చెందిన టీచర్ రాఘవేంద్రతో పాటు ఇద్దరు మరణించారు. రాఘవేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే యధావిధిగా పాఠశాలలకు వచ్చారు. తర్వాత కలెక్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఇద్దరు విద్యార్థులు...
దీంతో పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులను తన కారులో ఎక్కించుకుని రాఘవేంద్ర తన గ్రామానికి వెళుతుండగా మురుగు వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు విద్యార్థులు మరణించారు. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. మృతి చెందిన విద్యార్థులు సాత్విక్, మానిక్ లుగా గుర్తించారు. స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేదు. అప్పటికే కారు మునిగిపోవడంతో మృతదేహాలను గ్రామస్థులు బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధ్యాయుడు రాఘవేంద్రకు ఆ మార్గం కొత్త కావడంతో వాగులోకి కారును నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు.
Next Story