Mon Dec 23 2024 07:34:00 GMT+0000 (Coordinated Universal Time)
సాంబారులో పడి బాలుడికి గాయాలు
విజయనగరం జిల్లా ఎస్ గవరపాలెంలో విషాదం జరిగింది. వేడి సాంబారులో బాలుడు సాయి పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు
విజయనగరం జిల్లా ఎస్ గవరపాలెంలో విషాదం జరిగింది. వేడి సాంబారులో బాలుడు సాయి పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. తొలుత సాయిని ఎస్ కోటలోని ఆసుపత్రికి తరలించిన బంధువులు అక్కడ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.
నవమి వేడుకల్లో...
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీరానవమి సందర్భంగా గవరపాలెంలో సీతారామ కల్యాణం నిర్వహించారు. కల్యాణం పూర్తయ్యాక భోజనాలు జరుగుతుండగా ఐదేళ్ల బాలుడు సాంబారు గిన్నెలో పడిపోయాడు. బాలుడు తీవ్ర గాయాలపాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
- Tags
- boy
- hot sambar
Next Story