Sun Dec 22 2024 22:37:12 GMT+0000 (Coordinated Universal Time)
Nellore: నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం
నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది
నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ గూడ్స్ రైలు నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి వెళుతున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అత్యవసర రైళ్లను మూడో లైన్లోకి పంపించాలని నిర్ణయించారు.
"తెల్లవారుజామున 5గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి" అని రైల్వే అధికారులు తెలిపారు.
Next Story