Tue Mar 25 2025 06:43:04 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఉచిత బస్సు ఎక్కడి నుంచి ప్రారంభిస్తామో చెప్పిన మంత్రి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీపై పరిశీలిస్తున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు

మేనిఫెస్టోలో తమ ప్రభుత్వం ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీపై పరిశీలిస్తున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. విశాఖ నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని పేర్కొన్నారు. ఈ పథకం అమల్లో ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
అధ్యయనంచేసి...
ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు గత వైఎస్సార్సీపీ సర్కార్ ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదని విమర్శించారు. జీతాలు ఇచ్చేది ప్రభుత్వమని, కానీ కార్పొరేషన్ పేరు చెప్పి గత ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. అందుకే సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా రోడ్డు రవాణా సంస్థను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు.
Next Story