Mon Dec 23 2024 07:25:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో బిల్లులు 70 శాతం ప్రాసెస్ అయ్యాయ్
ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు 70 శాతం ప్రాసెస్ అయినట్లు ట్రెజరీ శాఖ డైరెక్టర్ మోహన్ రావు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు 70 శాతం ప్రాసెస్ అయినట్లు ట్రెజరీ శాఖ డైరెక్టర్ మోహన్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించి బిల్లుల ప్రాసెస్ ను వేగవంతం చేశామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ 70 శాతం బిల్లులను ప్రాసెస్ చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన బిల్లుల ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
మిగిలిన బిల్లులు కూడా....
కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 25 వేల బిల్లుల ప్రాసెస్ ను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మిగిలిన బిల్లులను కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. 1.2 లక్షల బిల్లులు ప్రాసెస్ లో ఉన్నాయని ఆయన చెప్పారు.
Next Story